*మన్యం న్యూస్, గుండాల: పశ్చిమ బెంగాల్ నుండి ఇస్కాన్ రామ రథం మండల కేంద్రానికి మంగళవారం చేరుకుంది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా రామ రథం భక్తుల అనుసరణతో రామనామం స్మరణతో మార్మోగింది. మండల కేంద్రానికి చేరుకోగానే రామభక్తులు రామ రథానికి స్వాగతం పలికి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ సభ్యులు వెంకట్ నారాయణ, జబ్బ పొట్టయ్య, గుండాల మండల గ్రామ భక్తులు మానాల శ్రవణ్ కుమార్, యసారపు రవి, టి సురేష్ , ఇల్లందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు
