మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 10…. లారీ ఢీకొని అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. లక్ష్మీదేవి పల్లి మండలం సాయి నగర్ కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ గొల్ల చందర్రావు పోస్ట్ ఆఫీస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిలుచుని ఉన్నాడు ఖమ్మం నుంచి కొత్తగూడెం కి వస్తున్న లారీ అదుపుతప్పి చందర్రావుని డి కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వన్ టౌన్ పోలీసులు మృతుడు భౌతిక్ కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
