మన్యం న్యూస్ ,వాజేడు:
మండలంలో కోయ వీరాపురం గ్రామ అటవీ ప్రాంతంలో 4000, లీటర్ల నాటు సారాకు కావలసిన ముడి సరుకు బెల్లం పానకంను ప్లాస్టిక్ డ్రమ్ములలో పులియబెట్టెరని, విశ్వసనీయ సమాచారం మేరకు వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కే, తిరుపతిరావు ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.పండగ సందర్భాలలో పల్లెల్లో గుడుంబా అధిక మోతాదులో విక్రయిస్తున్నట్లు స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. గుడుంబా అతి తక్కువ ధరకు 20 రూపాయలకు ఒక్క ప్యాకెట్ లభిస్తుండటంతో మందుబాబులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా గుడుంబానే సేవించడం అనారోగ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది, గుడుంబా సేవించే వారిలో అధిక శాతం మధ్య వయస్సు ఉన్నారు. గుడుంబా నాటు సారాను నివారించాలనీ ఎస్సై తిరుపతిరావు పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, తదితరులు పాల్గొన్నారు.





