కదం తొక్కిన వరద బాధిత నిరుపేదలు
*కోడిపుంజుల అంగడి స్థలాన్ని కేటాయించాలని పాదయాత్ర.
*సంక్రాంతి పండుగ. వంటావార్పు కోడిపుంజుల అంగడి ప్రాంతంలోని.
*బాధిత నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ.
*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
కోడిపుంజుల అంగడి స్థలాన్ని వరద బాధిత నిరుపేదలకు కేటాయించాలి.కోడిపుంజుల అంగడి ప్రాంతాల నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టిన వరద బాధిత నిరుపేదలు.1986 నుండి ఎన్నో ఏండ్ల తరబడి ముప్పు గ్రామాలలోని వరద బాధిత నిరుపేదలు. వరదలు వచ్చినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అట్టి పరిస్థితులలో 1986లో మానసపల్లి కోడిపుంజుల అంగడి స్థలాన్ని పోడు చేసుకుని.గుడిసెలు ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు,వరద బాధిత నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తూ గుడిసెలను కూల్చివేసినారు. గత కొంతకాలంగా ముప్పు గ్రామాల వరద బాధిత నిరుపేదలు,కోడిపుంజుల అంగడి స్థలంలో గుడిసెలు ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నారు. వరద బాధితుల పక్షాన వారికి అండగా ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టమట రఘు ఆధ్వర్యంలో 100మంది వరద బాధిత నిరుపేదలు పాదయాత్ర చేస్తూ,తాసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు.తాసిల్దార్ సంజీవ కు వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వరద బాధితులకు ఇంటి స్థలాలు కేటాయించేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తావని రానున్న సంక్రాంతి పండగ వాతావరణం కూడా కోడిపుంజుల అంగడి ప్రాంతంలోనే వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద బాధిత నిరుపేదలు,దళిత ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





