మన్యం న్యూస్ వాజేడు.
మండలంలో గుమ్మడిదొడ్డి, ఇప్పగూడెం, సుందరయ్య కాలనీ గ్రామాలలోని యువతకు సర్పంచ్ పాయం జయలక్ష్మి శుక్రవారంవాలిబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత, ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అంతటి శక్తి యువతకి ఉంది అన్నారు. క్రీడలు ఆడడంతో శరీరానికి వ్యాయామం చేకూరడం తో పాటు, యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా వ్యాయామం చేసి,ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు .యువకులు గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి దేశ భవిష్యత్తును ముందుకు నడిపించవలసిన బాధ్యత యువతపై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో.. సీనియర్ నాయకులు పాయం జానకి రమణ, నాంపల్లి లక్ష్మీనారాయణ,శ్రీను, ఏసుబాబు, ముత్తర బోయిన శ్రీనివాస్,ఎంట్టి సంతోష్, కంబాలపల్లి గణపతి, మేడం ప్రకాష్, చెన్నం సాంబశివరావు, మూడు గ్రామాల యువకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
