మన్యం న్యూస్, సారపాక, జనవరి 14..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు కి ఐటీసీ డీజీఎం హెచ్ఆర్ శ్యామ్ కిరణ్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం సారపాక పట్టణంలోని ఐటిసి కర్మాగారానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని ఐ టి సి హెచ్ ఆర్ డీజీఎం శ్యామ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు కి పుష్పగుచ్చం ఐటిసి డైరీ అందజేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిసిహెచ్ఆర్ డీజీఎం శ్యామ్ కిరణ్ తో పాటు ఐటీసీ చీఫ్ మేనేజర్ చెంగల్ రావు తదితరుల పాల్గొని రేగాకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
