మన్యం న్యూస్ , మణుగూరు, జనవరి 14: మండలంలోని ప్రజలు శనివారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ఇంటింటా భోగిమంటలు వేసుకున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. వీధులన్నీ పండుగ హడావిడితో సందడిగా మారాయి. ఆడపడుచులు, అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళగా మారాయి. మహిళలు అన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇళ్ళ ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు.
