మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 14: మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం ఘనంగా గోదాదేవి కళ్యాణంను అత్యంత వైభోవేతంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు బోడం వెంకటేశ్వరశర్మ, బోడెం వెంకన్న శర్మ, భాస్కరశర్మ, వేణు శర్మ, ఆద్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ముగింపు సందర్భంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న నిరతోత్సవ సేవల్లో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని గోదాదేవి రంగనాధుని కళ్యాణాన్ని శాస్త్రోక్త విధానంతో పురోహితులు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదెళ్ల పవన్ కుమార్, దారా రమేష్, దారా శ్రీనివాసరావు, ఇజ్జాడ అప్పారావు, దారా వెంకటేశ్వరరావు, సుగ్గల బాబు, నరేష్. తదతరులు పాల్గొన్నారు.