మన్యం న్యూస్ గుండాల: రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి. ఆర్ .ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆదాం శనివారం ఇల్లందు పర్యటనలో కలిశారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అనుచరుడిగా ఉంటూ సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఆపార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఆదం పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆదాం పార్టీ కి అందిస్తున్న సేవలను గుర్తించి, ఇల్లందు పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా దగ్గరుండి ఆదం ను మంత్రి హరీష్ రావుకు పరిచయం చేశారు. తనకి ఈ అవకాశం కల్పించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
