UPDATES  

 కూతురి చేతిలో మోసపోయిన వృద్ధురాలని ఆదుకున్న పోలీసులు.!

ఖాకీచకులు.. అని అంటుంటారు పోలీసుల్ని ఉద్దేశించి. కొందరి వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. నిజానికి, ఖాకీల్లో చాలామంది మంచివారున్నారు. ఉద్యోగ ధర్మం మాత్రమే కాదు, మానవత్వతోనూ మెలుగుతుంటారు. అసలు విషయానికొస్తే, వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మార్తా అనే వృద్ధురాలు, కన్న కూతురు దాష్టీకం కారణంగా రోడ్డున పడింది. డెబ్భయ్యేళ్ళ ఆ వృద్ధురాలి బతుకు దుర్భరంగా మారింది. అక్కున చేర్చుకున్న పోలీసులు.. మీడియాలో ఆ వృద్ధురాలి దీన గాధ గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆమెను అక్కున చేర్చుకున్నారు.

ఆమెకు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేశారు. మరోపక్క, దాత ఇచ్చిన స్థలంలో పోలీసులు చందాలు వేసుకుని ఓ చిన్న ఇల్లుని నిర్మించారు. ఇందుకోసం ప్రజలు, ప్రజా ప్రతినిథులు సైతం కొంతమేర సాయం చేశారు. వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలని ఆ ఇంటిలో ఏర్పాటు చేశారు. తనను పోలీసులు చాలా బాగా చూసుకుంటున్నారంటూ వృద్ధురాలు గొర్రె మార్తా సంతోషం వ్యక్తం చేశారు. కన్నబిడ్డ తనను ఇంటి నుంచి వెల్లగొట్టినా, తనకు మానవత్వంతో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిందామె. వృద్ధురాల్ని ఆదుకున్న పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !