UPDATES  

 మీ కడుపును శుభ్రం చేసే జల్ జీరా పానీయం!

ఈ పండగ సీజన్‌లో విందులు అధికంగా ఉంటాయి, మాంసాహారం, పిండి వంటలు, ఇతర అనేక రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినేస్తారు. దీని తర్వాత కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అజీర్తి మొదలైన సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఇలాంటి సందర్భాల్లో కడుపును శుభ్రం చేసే ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

కడుపులో చల్లదనాన్ని కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరిచే జల్ జీరా వంటి పానీయం ఈ పండగ సీజన్ లో ఒక మంచి రిఫ్రెష్ డ్రింక్ అవుతుంది. పుదీనా ఆకులు, నిమ్మరసం, నల్ల ఉప్పు, జీలకర్ర మొదలైన పదార్థాలు కలగలిసిన ఈ పానీయం జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే ఉబ్బరం, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఈ జల్ జీరా ఎలా తయారు చేసుకోవాలి? కావలసిన పదార్థాలు ఏమిటి ఇక్కడ తెలుసుకోండి, జల్ జీరా రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ఆధారంగా సులభంగా తయారు చేసుకోవచ్చు.

Jal-Jeera Recipe కోసం కావలసినవి

1/4 కప్పు శొంఠి చట్నీ మిశ్రమం
1/2 కప్పు పుదీనా ఆకులు
20 గ్రాముల కొత్తిమీర ఆకుల పేస్ట్
2-3 పచ్చిమిర్చి
1/2 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీలకర్ర పొడి
1/4 tsp కారం పొడి
100 గ్రాముల చింతపండు
ఉప్పు రుచికి తగినట్లుగా
శొంఠి చట్నీ మిశ్రమం కోసం కావలసినవి

100 గ్రాముల చింతపండు
3/4 కప్పు బెల్లం
1 స్పూన్ బ్లాక్ రాక్ సాల్ట్ పొడి
1/2 స్పూన్ గరం మసాలా
1 tsp పొడి అల్లం
1/4 స్పూన్ నల్ల మిరియాల పొడి
1/4 tsp కారం పొడి
1 స్పూన్ చాట్ మసాలా.
2 స్పూన్ ఉప్పు
2 కప్పుల నీరు

ముందుగా చింతపండను అరగంట సేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి, ఆ తర్వాత నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అనంతరం చింతపండు నీటిలో శొంఠి చట్నీ మిశ్రమం కోసం కావలసిన మిగతా పదార్థాలు వేసి అన్ని బాగా కలుపుతూ మరిగించాలి.
ద్రావణం చిక్కగా మారిన తర్వాత చల్లబరిచి, పైన పేర్కొన్న మిగతా పదార్థాలు కలపాలి.
రుచికి తగినట్లుగా ఉప్పును, నీటిని సర్దుబాటు చేసుకోవాలి.
అంతే, జల్ జీరా పానీయం రెడీ. ఒక సర్వింగ్ గ్లాసు లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !