ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే పుట్టగొడుగులు తినండి. అవును మీరు చదివింది నిజమే, పుట్టగొడుగులు తినడం ద్వారా అందులోని పోషకాలు చర్మాన్ని యవ్వనంగా మార్చగలవని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ, గడిచే ప్రతి ఏడాది మనల్ని వృద్ధాప్యానికి చేరువ చేస్తుంది. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం వలన ఈ వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చు. ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు, సమృద్ధిగా నీరు తీసుకోవడం వలన అవి వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇలాంటి పోషకాలు కొన్ని రకాల పుట్టగొడుగులలో పుష్కలంగా లభిస్తాయని వారి నివేదికలలో పేర్కొన్నారు. 3
యూఎస్‌లోని పెన్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, యాంటీ-ఏజింగ్ గుణాలు కలిగిన ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ సమ్మేళనాలు పుట్టగొడుగులలో అత్యధికంగా బయటపడ్డాయి. ఆ పుట్టగొడుగులను ఉడికించడం ద్వారా కూడా ఎర్గోథియోనిన్ సమ్మేళనాలు విచ్ఛిన్నం కాలేదు, అవి చాలా వేడిని కూడా తట్టుకునేలా ఉన్నాయి. అలాంటి పుట్టగొడుగులను రోజూ తినడం వలన వృద్ధాప్య సమస్యలతో పోరాడవచ్చని పరిశోధన వెల్లడించింది. Mushrooms for Youthful Look – ఎలాంటి పుట్టగొడుగులు తినాలి? పుట్టగొడులలో చాలా రకాలు విషపూరితమైనవే ఉంటాయి, తెలియకుండా అలాంటి వాటిని తింటే ప్రాణాలకే ప్రమాదం. పుట్టగొడుగులలో కొన్ని రకాలు మాత్రమే తినదగినవిగా గుర్తింపు పొందాయి. అలాంటి రకాలు తినడం వలన పోషకాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది. పరిశోధకులు మొత్తంగా 13 రకాల పుట్టగొడుగులపై పరిశోధనలు జరపగా అందులో కేవలం 2-3 రకాలలో మాత్రమే వృద్ధాప్యాన్ని దూరం చేసే పోషకాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆ పుట్టగొడుగుల రకాలు (Anti-ageing Mushrooms) ఏమిటో ఇక్కడ చూడండి.