మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్నికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయటం జరిగిందని మండల ప్రత్యేకాధికారి సంజీవరావు అన్నారు. సోమవారం స్థానిక రైతువేదిక నందు ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లు, రికార్డులను, సిబ్బంది ట్రైనింగ్ తదితర అంశాలను స్పెషలాఫీషర్ క్షుణ్ణంగా పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 19న మండలంలో కంటివెలుగు కార్యక్రమం. ప్రారంభించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపిడిఓ అన్నపూర్ణ, ఎంపిఓ తోట తులసీరాం, మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.
