మన్యం న్యూస్ గుండాల.. జనవరి 16.. మండలంలో ఉన్న పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గుండాల మండలంలో గిరిజనులు పెద్ద ఎత్తున పోడు సాగు చేస్తున్నారని అలాంటి వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. మిర్చి సాగు చేసుకున్న రైతులు నల్లి పురుగు వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని అలాంటి వారిని వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి ఎకరానికి రూ. 50వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, వెంకన్న , పర్షిక రవి, మంగన్న , పెంటన్న, గడ్డం లాలయ్య, ఈసం కృష్ణ , బాబు, నరసింహారావు తదితరులు పాల్గొన్నా
