మన్యం న్యూస్, మంగపేట.
మండలం లోని రమణక్కపేట , వాగోడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మినర్సాపురం గ్రామాలలోని నిరుపేద కుటుంబాలకు చెందిన రాచకొండ సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయంఅందించడం జరిగింది.మడకం నాగమ్మ, మడకం కృష్ణ మృతి చెందగా వారి దశ దిన కర్మలకు బియ్యం ఆర్థిక సహాయంను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మునిగల మహేష్,కనుకుంట్ల నాగరాజు,మంచాల నాగేంద్ర కుమార్, చిట్యాల రాజశేఖర్, నరహరి,బాడిశ ఆదినారాయణ,చిక్కుల శ్రీకాంత్,మంచర్ల కిశోర్,నిడదవోలు సాయి,చింతలపల్లి నరేష్,గుండారపు రమేష్,మండల సంతోష్,కృష్ణ,బాడిశ నవీన్,కొమరం నితిన్, మూర్తుల సంజీవరెడ్డి, కుర్సం శ్రీను,ముయ బోయిన శివ,కొర్స శ్రీకాంత్ ,కుర్సం ప్రకాశ్, కట్టం నాగరాజు గ్రామస్తులు కొర్స ముసలయ్య,సోడి సత్యం, మడకం రమేష్,మడకం రాజేశ్వర్ రావు,మడకం సమ్మయ్య,మాటూరి ఏడుకొండలు,మంచర్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
