ములకలపల్లి: మండలంలోని మాదారం గ్రామంలో ములకలపల్లి జడ్పిటిసి, టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి, మండల కాంగ్రెస్ నాయకులను ములకలపల్లి ఎస్సై సురేష్ అరెస్ట్ చేసి బుధవారం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది . ఈ సందర్భంగా జెడ్పిటిసి సున్నం నాగమణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం ఆగదొక్కలని చూడడం దారుణం అన్నారు. తమను అక్రమంగా ఉంటుంది అరెస్ట్ లు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖునిే చేయడమే అని, అక్రమ అరెస్టుల ను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ నాయకులు తాండ్ర ప్రభాకర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , పాలకుర్తి సుమిత్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు , పుష్పాల హనుమంతు మండల ఓబీసీ అధ్యక్షుడు, పాలకుర్తి రత్నభూషణం, పొడియం వెంకట కృష్ణ అశ్వరావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ , ఖాదర్ బాబా , గుర్రం కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
