మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 18 ..ముఖ్యమంత్రి కే.సి.అర్ ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంగా ముందస్తు గా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామికమని చుంచుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతటి పాల్ ఆరోపించారు బుధవారం కొత్తగూడెం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం వారు మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన నియంతల కొనసాగుతుందని ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలంటే రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వారన్నారు అరెస్ట్ అయిన వారిలో చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,జిల్లా మహిళ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొప్పుల రమేష్ ఉన్నారు ఇట్టి విషయం తెలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,,,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,మహిళ నాయకురాలు వెళ్ళే వారికి సంఘీభావం తెలిపారు