మన్యం న్యూస్ ఇల్లందు జనవరి18:- కేసిఆర్ ఖమ్మం బహిరంగ సభ నేపధ్యంలో ఇల్లందు అఖిల పక్ష పార్టీ నేతలను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఏం ఎల్ పార్టీకి చెందిన అవునూరీ మధు , తుపాకుల నాగేశ్వరావు, సాంబ రఘు లను ,కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, డానియల్ , బీజేపీ పార్టీ నేత మురళి కృష్ణ మొదలైన వారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంలో అఖిల పక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం తమ అరెస్ట్ అని తెలిపారు.