UPDATES  

 ఇంటింటికి కంటి వెలుగు పథకం.

మన్యం న్యూస్, వాజేడు: మండలంలో వాజేడు నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పిటిసి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, సర్పంచ్ తల్లడి ఆదినారాయణలువాజేడు నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలోగురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగాఎంపీపీ శ్యామల శారద, జడ్పిటిసి పుష్పలత లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందన్నారు . కంటి వెలుగు పథకం ద్వారా కంటి సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని, ఒక్క రోజులో 90 నుండి 120 మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని లోపాలున్నట్లయితే కళ్ళజోడు ప్రభుత్వం ఇష్టంగా అందజేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గూడూరు లక్ష్మణ్ , ఎంపీడీవో విజయ, డాక్టర్ కొమరం మహేందర్ ,సూర్య ప్రకాష్, కోటిరెడ్డి, ఆశ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !