మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 22:
డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బట్టా విజయ గాంధీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించవలసిందిగా రేవంత్ రెడ్డి ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకుగానూ-రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజలను ఐక్యంగా సంఘటితంచేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టబోయే హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను భద్రాచలంనుంచి రాములవారి సన్నిది సాక్షిగా ప్రారంభించడం శుభశ్రేయస్కరమని-ఈ యాత్రతో జిల్లా-నియోజకవర్గ స్థాయిల్లో ప్రజలతో బ్రహ్మరధం చేపడతామని విన్నవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో
టీపీసీసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడగం శ్రీనివాస్, సతీష్ దుమ్ముగూడెం మండల నాయకులు ఉబ్బ వేణు ఉప్పుసాక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, కొర్సా వెంకటేష్, కుంజా ప్రవీణ్, సాయికిరణ్, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.