మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 26: బావిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మణుగూరు మున్సిపాలిటీ సుందరయ్య నగర్ కు చెందిన అమూల్య ప్రసాద్ చిన్న కుమారుడు అరవింద కుమార్(23) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నడుముకు తాడు కట్టుకొని బావిలో దూకి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని సందర్శించి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.