మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 26: ఎన్నో రోజులుగా సందిగ్ధంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం పొత్తుల విషయాన్ని తేల్చి చెప్పేశారు. సిపిఐ, సిపిఎం నాయకులు మనవారే అన్నారు. ఇకనుంచి కలిసి పని చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇకనుంచి జరిగే సమావేశాలకు సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులను కూడా ఆహ్వానించి తీసుకురావాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిచి తీరుతామని, గెలిపించే బాధ్యత తనదన్నారు. ఎవరు అధైర్య పడవద్దు అని కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు.