UPDATES  

 మా మంచి డివి నే అత్యుత్తమం.

 

మన్యం న్యూస్ ఇల్లందు జనవరి26:- ఇల్లందు మున్సిపాలిటీ ని దేశంలోనే అత్యఉత్తమంగా ఉంచాలనే లక్ష్యంతో పరిశ్రమిస్తున్న ఫలితంగా ఇల్లందు  మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కు జిల్లా ఉత్తమ మున్సిపల్ చైర్మన్ గా గుర్తిపు దక్కింది.ఇల్లందు మిన్సిపల్ కమీషన్  అంకుషావలి కి జిల్లా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ గా రివార్డ్ దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  కొత్తగూడెంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం రోజు జరిగిన అవార్డ్స్ ప్రదానం కార్యక్రమంలో కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి ,తెలంగాణ విప్ రేగ కాంతారావు చేతుల మీదుగా భద్రాద్రి జిల్లా లో ఉత్తమ మున్సిపల్ చైర్మన్ గా దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ప్రశంసాపత్రం అందుకున్నారు. స్వచ్ఛతా మిషన్ పేరున తడి చెత్తా పొడి చెత్తా విషయంలో మున్సిపాలిటీ లోని ప్రజల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి, వెస్ట్ టు బెస్ట్ ఎలా తీసుకురావచ్చు, పనికి రాని చెత్త నుంచి ఉపయోగకరమైన వస్తువులను పదార్దాలను ఎలా తయారు చేయవచ్చు  అనే విషయంలో స్కూల్ పిల్లలతో  అవగాహన కార్యక్రమాలు వినూత్నంగా రూపకల్పన చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు.స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పేరుతో వాడవాడనా అనునిత్యం చెత్త, మురికి కాలువలు శుభ్రం చేయించటం,పిచ్చి మొక్కలను తొలగించటం వంటి కార్యక్రమాలు ముందుండి నడిపించారు కొన్ని సందర్భాలలో స్వయంగా చేశారు. ఇల్లందు ను ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ గా మార్చాలనే సంకల్పంతో వ్యాపారులు,హోటళ్ళు,దుకాణాల్లో  ప్లాస్టిక్ కు దూరంగా ఉంటే 10 వేలు నజరానా ప్రకటించటం లాంటి కార్యక్రమాలు వలన ఇల్లందు మున్సిపాలిటీలో గతంకన్నా చాలా వరకు చక్కటి మార్పు కనబడుతుంది.అన్నిటి కన్నా ఇల్లందు నడిబొడ్డున ఉన్నటువంటి బుగ్గవాగు ప్రక్షాళన చేయించారు. ఇక ఎవరూ బగ్గవాగును ప్రక్షాళన చేయలేరు అసాధ్యం అనేంత స్థాయిలో ఉన్న సమస్యను మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన అనతికాలంలోనే బగ్గవాగు ప్రక్షాళన చేసి చుయించి ఇల్లందు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. డైల్ యువర్ చైర్మన్ పేరుతో ప్రతి శుక్రవారం  ప్రజల సమస్యలు ఫోన్ ద్వారా తెలుసుకునే కార్యక్రమం నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !