ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశపు బలమైన శక్తిగా ఎదుగుతుంది.
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సింగరేణి సంపూర్ణ సహకారం.
దేశ అవసరాలను గుర్తించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తున్నది సింగరేణి
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తున్నాం
74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సింగరేణి డైరెక్టర్ (పా )చంద్రశేఖర్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 26.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం బలమైన శక్తిగా ఎదగడమే కాకుండా రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సింగరేణి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ విద్యుత్తును సరఫరా చేసేందుకు ముందుకు వస్తుందని అందుకు అనుగుణంగానే దేశ అవసరాలను గుర్తించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి సంస్థ అనునిత్యం కష్టపడుతుందని సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సింగరేణి చైర్మన్ అండ్ ఎండి సందేశాన్ని చదివి వినిపించారు. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం అవసరమును భావించి విద్యావంతుడైన మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ప్రత్యేక రాజ్యాంగాన్ని రచింపబడింది అన్నారు. ఆ రాజ్యాంగం ద్వారానే భారత ప్రజలకు అన్ని రకాల స్వేచ్ఛను ప్రసాదించడంతోపాటు ప్రజాస్వామ్యక లౌకిక భారతదేశంగా మనల్ని మనం ప్రకటించుకున్నామన్నారు. దేశంలో 22 భాషలు ఆరుగు పైగా మతాలు వేలాది కులాలు భిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కొన్ని ఇతర దేశాలు మాదిరిగా ఎటువంటి అంతర్ యుద్ధాలు తిరుగుబాటు లేకుండా 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో దృఢంగా ముందుకు పోతున్నామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆధునిక నివాస గృహాలు నిర్మించడం జరుగుతుందని ఇప్పటికే సుమారు 50వేలనివాసగృహాలను అదనంగా మరో నాలుగు 643 కొత్త క్వార్టర్ల నిర్మాణానికి అనుమతించడం జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగం సూచించిన విధంగా సింగరేణి సంస్థలు రిజర్వేషన్లు తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని సంస్థ తనకు తానుగా ఏరియా స్థాయి కంపెనీ స్థాయి ఎస్సీ, ఎస్టి లైజన్ అధికారులు కూడా నియమించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమిత కాకుండా 1200 మెగావట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విధితమే అన్నారు. అన్ని నిబంధన ప్రకారమే సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి సింగరేణి యాజమాన్యం పనిచేస్తున్నారు అన్నారు. రానున్న కాలంలో కొన్ని సవాళ్ళ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ అవసరాలు ఇచ్చే ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లోని కేటాయిస్తుందని అన్నారు. అన్ని సవాలను ఎదుర్కొంటూ దేశంలో వేలాది ప్రభుత్వ పరిశ్రమలు స్థాపించినప్పటికీ సింగరేణి లాంటి సమర్థవంతమైన కంపెనీలు మాత్రమే నేడు మనుగడ లో ఉన్నాయని అన్నారు. అనంతరం ఉత్తమ సింగరేణియులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో వివిధ పాఠశాల నుంచి వచ్చిన చిన్నారులు చేసినటువంటి నృత్యాలు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెతెచ్చాయి. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు సింగరేణి యూనియన్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.