మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 27: అశ్వారావుపేట మండలం తహసీల్దార్‌గా లూథర్ విల్సన్ ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వారావుపేట తహసీల్దార్‌గా ఉన్న చల్లా ప్రసాద్ ను పినపాక మండలం బదిలీ చెయ్యడం జరిగింది. జూలూరుపాడు మండల తహసిల్దార్ గా ఉన్న విల్సన్ అశ్వరావుపేట మండలానికి బదిలీ చేయబడగా ఇదే అశ్వరావుపేట మండలానికి గతంలో డీటీగా పని చేసి ఉండటం విశేషం.