మనం న్యూస్, సారపాక , జనవరి 27
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని జడ్పిటిసి కార్యాలయంలో శుక్రవారం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి లు మన్యం న్యూస్ క్యాలెండర్ ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, ఆ పార్టీ బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ లు పాల్గొని మాట్లాడుతూ… మన్యం న్యూస్ అద్భుతమైన కథనాలను ప్రచురితం చేస్తూ దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వల్లూరు వంశీ మాట్లాడుతూ… మన్యం న్యూస్ పత్రికలో ప్రచురితమవుతున్న పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తూ ఆ సమస్యల నివృత్తికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, పినపాక యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణ, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, భూక్య శ్రీను, ఏసోబు, చుక్కపల్లి బాలాజీ, రంజిత్, కృష్ణ, చిరంజీవి, పంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు.