మన్యం న్యూస్ కరకగూడెం, జనవరి 27.. కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామంలోని సారలమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకోని వనదేవతలను శుక్రవారం ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క కుమారుడు సూర్య దర్శించుకున్నారు. అదేవిధంగా గుడి విరాళంగా రూ.5116 రూపాయలు అందజేశారు. అలాగే మూడు రోజులపాటు జరిగిన వాలీబాల్ క్రీడలలో మెదటి బహుమతి గెలుపొందిన ములుగు జిల్లా వాజేడు మండల పరిదిలోని కొంగల గ్రామ క్రీడాకారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కౌన్సిలర్ పోలెబోయిన క్రీష్ణయ్య,ద్వితీయ బహుమతి గెలుపొందిన ములుగు జిల్లా మంగపేట మండలం చింతకుంట గ్రామనికి చెందిన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ జవ్వాజి.రాధ- సమ్మయ్య లు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జాడి.రామనాధం,ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమరం.వెంకట్ నారాయణ స్తానిక సర్పంచ్జవ్వాజి.రాధ,ఉపసర్పంచ్ బొడ.ప్రశాంత్,మెడికల్ అధికారి పోలెబోయిన.క్రీష్ణయ్య, సారలమ్మ జాతర దేవారబాల.డిల్లి.సరోజన-క్రిష్ణయ్య,ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు ఊకె.రామస్వామి, తదితరులు పాల్గొన్నారు