మన్యం న్యూస్, మణుగూరు, జనవరి27:
కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన శుక్రవారం మణుగూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కోడి పందాలు ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో ఎస్సై బట్ట పురుషోత్తం తన సిబ్బందితో కలిసి జిఎం ఆఫీస్ వెళ్లే దారిలో గల మామిడి తోట వద్ద దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పది మోటార్ సైకిళ్ళు, 5900 రూపాయల నగదు, రెండు కోడిపుంజులు, మూడు సెల్ ఫోన్ లు, కత్తులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.