మన్యం న్యూస్, మణుగూరు, జనవరి27: క్రీడలతోపాటు ఉద్యోగ బాధ్యతను కూడా అంకిత భావంతో నిర్వహించాలని మణుగూరు బిటిపిఎస్ సిఈ బిచ్చన్న అన్నారు. హైదరాబాదులో జరిగిన జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ లో తృతీయ బహుమతి సాధించిన మణుగూరు టీం సభ్యులకు ఆయన శుక్రవారం బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త టీం అయినా మంచి ప్రతిభ కనబరిచి బహుమతి సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు సంస్థ ఎప్పుడూ తోడ్పాటు నిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని బహుమతులు కైవసం చేసుకుని మణుగూరు బి టి పి ఎస్ ను అగ్ర భాగాన నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పార్వతి, నరసింహారావు, సాయి ప్రసాద్, నాగేశ్వరరావు, చిట్టిబాబు, రమేష్, కృష్ణ కుమార్, రంగారావు, తిరుపతయ్య, భరత్, మధు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.