మనం న్యూస్, భద్రాచలం , జనవరి 27
ప్రభుత్వం గిరిజన బాలికల కోసం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని గిరిజన బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఐటీడీఏ ఏపీవో జనరల్,ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్ అన్నారు. శుక్రవారం గిరిజన బాలికలు చైతన్యవంతులను గావించి వారి సర్వతో ముఖాభివృద్ధి కోసం రూపకల్పన చేసిన వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామును భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ ఐఏఎస్ ఆదేశానుసారం శుక్రవారం భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో భద్రాచలం ఐటిడిఏ ఏపీవో జనరల్, ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక శిక్షకులు ఈ ప్రోగ్రాంలో బాలికలకు అనేక అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. 7,8,9 తరగతులు చదువుతున్న బాలికలకు ఈ ప్రోగ్రాం 10 రోజులపాటు సాగనుంది. డేవిడ్ రాజ్ మాట్లాడుతూ… బాలికలకు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో బాలికలు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎం దేవదాసు, పాఠశాల టీచర్స్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.