గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం.
నియోజకవర్గ సమగ్రభివృద్ధికి కృషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 27.. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తుందని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పేర్కొన్నారు . శుక్రవారం మండలంలోని ఉప్పుసాక, పినపాక పట్టి నగర్, మొరంపల్లి బంజర, జింకల గూడెం, లక్ష్మీపురం, ఉడ్డీ యార్డ్, నకిరేపేట టేకులచెరువు, ముసలిమడుగు, రామాపురం, కృష్ణ సాగర్ గ్రామాలలో పలు సిసి రోడ్లను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజవర్గంలోని అన్ని మండల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు, గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రజలు అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు, ఇంటి స్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి త్వరలోనే ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు, పంటల సాగుకు ప్రభుత్వం రైతుబంధు ద్వారా రైతులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను ఆపకుండా అన్ని పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు, తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారు అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు, సీఎం కేసీఆర్ గారి పాలనలో కని విని ఎరుగని రీతిలో పట్టణాలు గ్రామాల అభివృద్ధి చెందాయ ని దేశం అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నది అన్నారు, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకంజ వేయడం లేదని అన్నారు, ప్రతి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎంపీడీవో, వివిధ రకాల శాఖలకు సంబంధించిన అధికారులు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల కార్యదర్శి జలగం జగదీష్,వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వివిధ గ్రామాల గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.