మన్యం న్యూస్, భద్రాచలం, జనవరి 27
భద్రాచలం ఏఎస్పీగా పరితోష్ పంకజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని గ్రేహౌండ్స్ ఏఎస్పీగా పని చేస్తున్నారు. కాగా ప్రస్తుత ఏఎస్పీ రోహిత్ రాజ్ హైదరాబాదులోని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ బదిలీ చేశారు. ఇక బీహార్ లోని భోజాపూర్ జిల్లా ఆరా నగరానికి చెందిన పరితోష్ పంకజ్ 2015 వరకు జర్మనీలోని మర్చంట్ నేవీ ఆధ్వర్యంలో ఉద్యోగం చేశారు. అప్పుడే యూపీఎస్సీపై దృష్టి సారించిన ఆయన ఉద్యోగం వదిలేసి పట్టుదలతో చదివారు. అయినా 2016, 2017, 2018 సం వత్సరాల్లో సివిల్స్ రాసినా విజయం సాధించ లేకపోయారు. నాలుగో ప్రయత్నంగా 2019లో కష్టపడి చదివి ఆలిండియా స్థాయిలో 142వ ర్యాంక్ సాధించారు.