మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 27..
జిల్లా పోలీస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన రాజబాబు కుటుంబానికి శుక్రవారం జిల్లా ఎస్పీ డా.వినీత్. ఎస్పీ కార్యాలయంలో లక్ష రూపాయల చెక్కును చేయూతగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో మరణించిన రాజబాబు కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా కృషి చేయాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు,జూనియర్ అసిస్టెంట్ మధు లు పాల్గొన్నారు.