UPDATES  

 అయ్యా సారూ… మా గోస తీర్చేదెవరు…? -కడుపు నిండా బువ్వ లేకపాయె.

అయ్యా సారూ… మా గోస తీర్చేదెవరు…?
-కడుపు నిండా బువ్వ లేకపాయె.
-జ్వరం వస్తే ఇంటికే.
-నిర్లక్షంగా వ్యవహరిస్తున్న వార్డెన్.
-షెడ్యూల్ సంక్షేమ బాలుర వస్సతి గృహం విద్యార్థుల ఆవేదన.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి27: అయ్యా సారూ మా గోస ఎవరు తీరుస్తారు, కడుపునిండా బువ్వ కూడా పెట్టడం లేదని మణుగూరు షెడ్యూల్ సంక్షేమ బాలుర వస్సతి గృహం విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విద్యార్థులు సమస్యలు దృష్టికి తీసుకు వెళ్ళినా పట్టించుకోకుండా వార్డెన్ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాడు. మెనూ ప్రకారం భోజనం ఉండదు, ఒకవేళ పెట్టినా అది బాగుండదు. కడుపు నింపుకోవడం కోసం ఏది పెడితే అది తినాల్సిన పరిస్థితి. మంచినీటి సదుపాయం కూడా సరిగా లేకపోయే. స్నానాలు చేసే దగ్గర, టాయిలెట్స్ దగ్గర అంతా పాకురు పేరుకుపోయి ఉంది. పొరపాటున పిల్లలు కింద పడితే అంతే సంగతులు. ఇదిలా ఉంటె జ్వరం వచ్చినా పిల్లలను చూసే దిక్కు లేదు. వార్డెన్ వచ్చి వెళ్తుంటారు అని పిల్లలు వాపోతున్నారు. హాస్టల్ లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ కూడా పనిచేయడం లేదు. అదేవిధంగా హాస్టల్లో ఉన్న సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు. పాస్టర్ సమస్యలను పట్టించుకునే నాధుడే లేడు.నీరు లేనప్పుడు పిల్లలు బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా వార్డెన్ను ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేస్తున్నారని, సీనియర్లు వీడియో తెస్తే సెల్ ఫోన్ కూడా పగులకొట్టారని, నాకు పోలీసు అధికారులు తెలుసు నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్లో వార్డెన్ పై ఫిర్యాదు కూడా చేసిన సంఘటన నెలకొంది. ఈ వార్డెన్ మాకు వద్దని, అధికారులు స్పందించి వేరే వార్డెన్ ను ఇవ్వాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !