మన్యం న్యూస్ చర్ల జనవరి 27:
ఎలక్ట్రిషన్ డే సందర్భంగా శుక్రవారం చర్ల మండలం సంత మార్కెట్ నందు జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్ల మండలంలోని సీనియర్ ఎలక్ట్రిషన్ చంద్రశేఖర్ జండా ఆవిష్కరణ నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ ఎలక్ట్రిషన్ చారి, వెంకట్రావు,నారాయణ, చక్రవర్తి , కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వృత్తిలోని తగు జాగ్రత్తలు తీసుకొని పనిచేయవలసిందిగా సూచనలు సలహాలు ఇచ్చారు. జండా ఆవిష్కరణ అనంతరం యూనియన్ యొక్క ఉనికిని చాటుకుంటూ బైక్ పై ర్యాలీ నిర్వహించి జై ఎలక్ట్రిషన్ జయ జయ ఎలక్ట్రిషన్ అంటూ, అదే విధంగా థామస్ ఆల్వా ఎడిషన్ వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండలం ఎలక్ట్రిషన్ సోదరులందరూ పాల్గొన్నారు.