మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 27: మండలం లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం లక్ష్మీపురం గ్రామానికి చెందిన స్థానిక వార్డ్ నెంబర్ తోకల రమణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం ద్వారా మంజూరైన షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్న సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి నిరంతరం తపిస్తున్నారని చెప్పారు, దళిత బంధు పథకాన్ని తెలంగాణలో విజయవంతంగా అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్నా కలలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు గుర్తు చేశారు. పూర్తిగా ఉచితంగా మంజూరు చేస్తూ వారికి జీవన ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు, లబ్ధిదారులకు అందించిన యూనిట్లను సక్రమంగా వినియోగించుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్, బిక్షాని శ్రీనివాసరావు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాలయ్య, బీసీ సంక్షేమ మండల నాయకులు, ముస్లిం మైనారిటీ మండల నాయకులు, పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.