అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
– సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 27
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక అధ్యక్షతన భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు కనకయ్య పాల్గొని మాట్లాడుతూ… భద్రాచలం పట్టణంలో నిర్మాణదశలో ఉన్నటువంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న పేదలందరిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే ఇండ్లు కేటాయించాలని ఆయన కోరారు. ప్రభుత్వం హామీ మేరకు ఖాళీ స్థలం ఉన్న పేదలకు ఇండ్ల నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి ఎం.బి.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.