UPDATES  

 కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ

కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ
మన్యం న్యూస్, పినపాక, జనవరి 27
మండలంలోని తోగ్గూడెం పంచాయతీలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల వారీగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు అయ్యాయని, కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ
సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు దుర్గా భవాని, పంచాయతీ సెక్రటరీ కృష్ణమూర్తి, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !