మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 27.. 74వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఉత్తమ అధికారుల ఎంపికలో భాగంగా అశ్వారావుపేట మండల ఎంపీవో సీతారామరాజు, అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ ఈవో గజవల్లి హరికృష్ణ లు ఎంపిక కాగా జిల్లా కేంద్రంలో ప్రగతి మైదానంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ వద్ద ఎంపీవో సీతారామరాజు, ఈవో గజవెల్లి హరికృష్ణ లకు మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు, పుష్పగుచ్చం ఇచ్చి అభినందలు తెలిపారు. ఈ సందర్బగా ఎంపీఓ, ఈవోలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి ఉత్తమ అధికారిగా ఎంపిక చేసిన కలెక్టరుకు అందుకు సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఆకూరి సుబ్రహ్మణ్యం, మట్లకుంట కామేశ్వరరావు, ఆరేపల్లి నాగేందర్రావు, మూల అప్పన్న కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.