UPDATES  

 నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి -గురుకులం ఇంచార్జ్ ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్

నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి
-గురుకులం ఇంచార్జ్ ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్

మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 28
10వ తరగతి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే విధంగా సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా శ్రద్ధ చూపి పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని గురుకులం ఇంచార్జ్ ఆర్.సి.ఓ డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. శనివారం ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ లతో తన ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లకు సూచనలు ఇస్తూ… ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశానుసారం విద్యార్థులను ఎవరిని ఇండ్లకు పంపించవద్దని, ఇండ్లకు వెళ్లిన వారిని వెంటనే తల్లిదండ్రులకు ఒప్పించి పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండ్లకు వెళ్లిన విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో సిలబస్ చాలావరకు పూర్తి చేశారని, కానీ మరల పూర్తిస్థాయిలో రివిజన్ ప్రారంభించి ఫిబ్రవరి వరకు పూర్తి చేయాలని అన్నారు. సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న పిల్లలకు దానికి సంబంధించిన టీచర్లు శ్రద్ధతో ప్రత్యేక తరగతులను తీసుకోవాలని, అలాగే లాంగ్ ఆబ్సెంట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు టీసీలు ఇవ్వకూడదని అన్నారు. అదేవిధంగా పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు స్పెషల్ టైం టేబుల్ జారీ చేయడం జరిగిందని పేర్కన్నారు. దాని ప్రకారము ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ప్రత్యేక పరీక్ష నిర్వహించి వారి యొక్క మేధాశక్తిని పరీక్షించి పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు.అందుకు ప్రిన్సిపాల్ లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి శనివారం పిల్లల చేత ఏదో ఒక సబ్జెక్టుపై పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలని, ఈ పాఠశాలల్లో త్వరలో వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం ప్రారంభిస్తామని అన్నారు. ఉపాధ్యాయులందరూ పాఠశాలల్లో జరిగే అసెంబ్లీ లో తప్పనిసరిగా హాజరుకావాలని, దానికి సంబంధించిన ఫోటోలు తనకు వాట్సాప్ ద్వారా పంపించాలని అన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికారమైన ఆహారం అందించాలని, త్రాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గండిగుళ్లపల్లి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పాల్వంచ ప్రిన్సిపాల్ స్వర్ణ, టేకులపల్లి ప్రిన్సిపాల్ భద్రయ్య, చర్ల ప్రిన్సిపాల్ శకుంతల, దుమ్ముగూడెం ప్రిన్సిపాల్ వీరాస్వామి, గుండాల ప్రిన్సిపాల్ సంధ్య, సింగరేణి ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ములకలపల్లి ప్రిన్సిపాల్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !