మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 28.. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలిచింది మన్యం న్యూస్..
“మనసున్న మహనీయులు ఆదుకోండి” అనే మన్యం వార్త కథనానికి స్పందించి శనివారం పదివేల రూపాయలు నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి చిన్న అరుణాచల ఆలయ వ్యవస్థాపకులు శివ నాగ స్వామి భక్తులు దాతల సహాయంతో పదివేల రూపాయల సహాయాన్ని అందించారు. ముసలమడుగు గ్రామానికి చెందిన ఓర్సు నరసింహారావు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్య కోసం ఖమ్మం ఒక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స పొందుతున్న నరసింహారావు దగ్గరికి ఆలయ సభ్యులు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. దాతలకు అటు మన్యం న్యూస్ కుటుంబ సభ్యులకు బాధితుల కుటుంబ సభ్యులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు