మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని మోతే గ్రామం వద్ద పెద్దవాకపై 4 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాటిని అమలుపరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రతి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలలోకి తీసుకెళ్లి విధిగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి కోఆప్షన్ సభ్యులు ఎస్ సొందు పాషా,గుమ్మడివెల్లి.ప్రసాద్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.