UPDATES  

 భారతీయ సాంప్రదాయం చాలా గొప్పది….. – పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి.

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి28: అన్ని సాంప్రదాయాలకల్లా భారతీయ సాంప్రదాయం చాలా గొప్పదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి శనివారం అన్నారు. హైదరాబాదులోని ఒక వివాహ వేడుకకు హాజరయ్యానని, ఆ వేడుకలో విదేశీ మహిళ భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించి చీర కట్టులో వివాహానికి హాజరైందన్నారు. భారతీయులు విదేశీ సంస్కృతిని ఆచరిస్తుంటే, విదేశీయులు మన భారత సంస్కృతిని ఆచరిస్తున్నారని, ఇది భారతీయులందరికీ గర్వకారణం అన్నారు. ఈ వేడుకలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక  పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !