మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని మొగల్తూరు గ్రామానికి చెందిన అరెం.నాగర్జున్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో శనివారం వారినివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల.సోమయ్య, కో ఆప్షన్ సభ్యులు సోందు పాషా,భూక్య. అర్జున్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.