మన్యం న్యూస్, మణుగూరు, జనవరి28: శ్రీ భవాని లింగమంతుల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వవిప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇనపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. అశ్వాపురం మండలం రేగుల గండి గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ భవాని లింగమంతుల జాతర ఏర్పాట్ల పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5,6,7 తేదీలలో జరిగే శ్రీ భవాని లింగమంతుల జాతర పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఎలాంటి అవసరాలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు లంకెల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంటా గోవర్ధన్ యాదవ్, కోశాధికారి తోట శేషయ్య యాదవ్, కార్యనిర్వహణ కార్యదర్శి మంగి మల్లికార్జున యాదవ్, అశ్వాపురం మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ మణుగూరు అశ్వాపురం మండలం యాదవ పెద్దలు మేకల ఆది లింగయ్య యాదవ్, మద్ది పెద్దిరాజు యాదవ్, కడారి నగేష్ యాదవ్, బొల్లినేని గణేష్ యాదవ్, నక్కన పోయిన పాపారావు యాదవ్ మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.