మన్యం న్యూస్ కరకగూడెం, జనవరి 28 మండలంలోని వాలీబాల్ క్రీడాకారులకు ఖమ్మం జిల్లా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను శనివారం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతారం ఉప సర్పంచ్ అత్తె. సత్యనారాయణ,ఎర్ర సురేష్, జలగం కృష్ణ,పూనెం శంకరయ్య,భూక్య రాందాస్, గడ్డం.రాజేష్,కరకపల్లి నగేష్, నిట్ట.సత్యం,అకిరెడ్డి నరసింహులు,రాజేంద్రప్రసాద్, కేశవరావు, నవీన్ రెడ్డి, రామక్రిష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.