మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 28
మణుగూరు ఏరియా పికేఓసి-2 బేస్ వర్క్ షాప్ నందు కొత్తగూడెం రీజియన్ స్థాయిలో విధులు నిర్వహిస్తు,తగిన అర్హత గల “ఏ” గ్రేడ్ ఈ పి ఆపరేటర్లకు,అంతర్గత స్పెషల్ గ్రేడ్ ఈపి ఆపరేటర్ల పదోన్నతులు 18 ఖాళీల భర్తీకి శనివారం నాడు ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ముఖ్య అత్యధిక పాల్గొని మాట్లాడుతూ,కొత్తగూడెం రీజియన్ స్థాయిలో మణుగూరు,సత్తుపల్లి,కొత్తగూడెం,ఇల్లెందు ఏరియాలలో పనిచేస్తు,మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి,దరఖాస్తు చేసుకున్న ఏ గ్రేడ్ ఆపరేటర్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని,వారికి మౌఖిక రిటన్,ప్రాక్టికల్ టెస్టులు నిర్వహించామని వారు తెలిపారు.సీనియారిటీ ప్రామాణికం అయినప్పటికీ, పనిలో అంకితభావం, ప్రమాదాలకు తావివ్వకుండా యంత్రాలు నడపడం,భారీ యంత్రాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై సరైన అవగాహన కలిగి ఉండటం,డ్రైవింగ్ పై చక్కని అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రమాదాలు సంభవిస్తాయన్న సందర్భంలో తనని తను కాపాడుకుంటూ యంత్రాన్ని కూడా ఎలా కాపాడాలి అనే అంశంపై సరైన అప్రమత్తత లాంటి అంశాలపై ఆపరేటర్లు ఎంత మేరకు అవగాహన కలిగి ఉన్నారు, అనేది గీటురాయిగా ఇంటర్వ్యూలు,నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఏరియా ఎస్ ఓ టూ జీఎం డి.లలిత్ కుమార్ పర్యవేక్షణలో మొత్తం 24 మంది అభ్యర్ధులకు నిర్వహించిన ఈ టెస్ట్ కు, 15 మంది హాజరు అయ్యారు కాగా,రెండు రోజులు కలిపి మొత్తం 47 అభ్యర్ధులకు గాను 38 మంది అభ్యర్ధులు హాజరైనారు అని తెలిపారు. కంపెనీ నిభందనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించబడిన ఈ టెస్ట్ లో అభ్యర్ధుల ప్రతిభ,మెరిట్ లో వచ్చిన అభ్యర్ధులను కార్పొరేట్ స్థాయిలో ఎంపిక చేసి, అభ్యర్థులకు త్వరలో సమాచారం అందించడం జరుగుతుందని అధికార ప్రతినిధి,డిజిఎం పర్సనల్ ఎస్. రమేశ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ ఎస్ రమేష్,డిజిఎం పర్సనల్, కార్పొరేట్ కె అజయ్ కుమార్, ఎస్ఈ దాసరి రాజశేఖర్, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,సీనియర్ అసిస్టెంట్ ఎం రాజు, తదితరులు పాల్గొన్నారు.