మన్యం న్యూస్, భద్రాచలం, జనవరి 28
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో గల త్రివేణి స్కూల్లోమాక్ పార్లమెంట్ న్యాయ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రథమ శ్రేణి జడ్జి నీలిమ ముందుగా స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిని వెలిగించి మాట్లాడుతూ… పిల్లలకు చిన్నప్పటి నుంచే నీతిగా నిజాయితీగా ప్రతి విషయంలో స్కూల్ టీచర్స్ చెప్పిన విధంగా నడుచుకోవాలని అన్నారు. అలాగే ఇంటి వద్ద తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి న్యాయపరమైన మంచి, చెడులు గురించి పిల్లలకి అర్థం అయ్యే రీతిలో వివరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ… పిల్లలకు చిన్ననాటి నుండి నిజాయితీగా ఉండాలని అబద్ధాలు ఆడకూడదని, నిజాలే మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కానుమిల్లి విమలాదేవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాబురావు, అక్డమిక్ ఇంచార్జ్ నరేష్, క్యాంపస్ ఇంచార్జ్ సందీప్ రెడ్డి, తోటి అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.