నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం…
– కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ధనసరి సూర్య.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి28: మణుగూరు మండలంలోని తోగ్గూడెం శివం ఫంక్షన్ హాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోని తన అభిమానులు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ యువజన నాయకుడు దనసరి సూర్య శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి అభిమానులు, ముఖ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.