మన్యం న్యూస్ ఇల్లందు జనవరి28: హత్ సే హత్ జోడో అభియాన్ పాదయాత్ర లో బాగంగా ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిఎల్పి పిలుపు మేరకు చీమల వెంకటేశ్వర్లు అధ్వర్యంలో శనివారం సుదిమళ్ళ, కొత్తూరు, హనుమంతుల పాడు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ భారత్ జొడో యాత్ర ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలిపారు.ప్రజలతో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాటల్లోనే ప్రజలకు తెలియపరిచారు రాహుల్ గాంధీ కన్యకుమారి నుండి కాశీ వరకు సుదీర్ఘ పాదయాత్ర పేద ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేయడం చాలా సాహాసోపేతం, అయిన నిర్ణయం అని అన్నారు .కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా సంపద ను కొల్లగొట్టి దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని ఈ రెండు ప్రభుత్వాల వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరికి తెలియ చేసేందుకు, యాత్ర కొనసాగుతుందన్నారు. నిత్యవసర వస్తువుల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రజా సంపదనీ ఆదాని అంబాని లకే దోచి పెట్టడం, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వకుండా నిరుద్యోగులకు బృతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఖచ్చితంగా రాబోయే రోజులలో కేంద్రంలో , రాష్టంలో కాంగ్రెస్ పార్టి అధికారంలోనికి వస్తుంది అని ఆశా భావం వ్యక్తం చేసారు
ఈ కార్యక్రమంలో ఎం ఎ జలీల్, పులి సైదులు, మోకాళ్ళ వెంకటమ్మ, సుదిమళ్ళ ఉప సర్పంచ్ ఊకే క్రిష్ణ,ఏపే పగడయ్య,చింత రాంబాబు,మూతి ముత్యాలు,ఊకే అబ్బయ్య,ఊకే బుచ్చయ్య,చీమల ఆదేమ్మ,ఊకే భధ్రయ్య,చీమల లక్ష్మీ,కాయం రమేష్,గొగ్గెల పాపారావు తదితరులు పాల్గోన్నారు